Home / NIA
దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీషని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీలోని టంగుటూరు మండలం ఆలకూరుపాడులో నివసిస్తున్న ఆర్కే భార్య శిరీష నివాసంలో శుక్రవారం ఉదయంనుంచి ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రంపూట శిరీషని అరెస్ట్ చేశారు
Kodi Kathi Case: కోడికత్తి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎన్ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించాడు
కోడికత్తి కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు ఘటనతో సంబంధం లేదని ఎన్ఐఏ తెలిపింది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని విచారణలో తేలిందని పేర్కొంది.
Gajarla Ravi: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ టార్గెట్ చేసింది. గాజర్ల రవి ఆచుకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. గాజర్ల రవి.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందినవాడు.
భారతదేశం మరియు విదేశాలలో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు మరియు ట్రాఫికర్ల మధ్య బంధాన్ని భంగపరిచేందుకు ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) మంగళవారం పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్టు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు. పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేశారని, దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ ఇచ్చినట్టు నిర్ధారించారు.
తెలుగు రాష్ట్రాల్లో కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాదం వైపు యువతను మళ్లిస్తున్న సంస్ధల్లో ఒకటైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యకలాపాలపై మరోమారు నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలపై తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాల నేపధ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలపై భాజాపా నేత విష్ణువర్ధన రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు
ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం మరియు అతని ముఖ్య సహచరులకోసం నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నగదు రివార్డును ప్రకటించింది. దావూద్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.25 లక్షలు, ఛోటా షకీల్‌కు రూ.20 లక్షలు అందజేస్తారు.
ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాల పంపిణీకి ఉపయోగించే డ్రోన్‌ను అడ్డగించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లోని ఎనిమిది వేర్వేరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.