Anil Chauhan Warns to Asim Munir: ఆసిం మునీర్ నీ తీరు మార్చుకో.. : భారత త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ వార్నింగ్!
Anil Chauhan on Asim Munir: అసత్యాలు ప్రచారం చేయడంలో ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ తరువాతే. తాజాగా సిగ్గూ ఎగ్గూ లేకుండా కొన్ని అబద్దాలు మాట్లాడాడు. ఇటీవల భారత్ పై పాకిస్తానే విజయం సాధించిందన్నాడు. దీంతో ఆసిం మునీర్ బిల్డప్ పై మండిపడ్డారు భారత త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్.
కిందపడ్డా మాదే పైచేయి అనడం పాకిస్తాన్ కు అలవాటే.ఈసారి కూడా దాయాది దేశం అదే చేసింది. భారత్ తో యుద్దంలో తామే విజయం సాధించామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ మరోసారి బిల్డప్ ఇచ్చారు. పాకిస్తాన్ లో తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో భారత్ పై పాకిస్తాన్ బలగలు విజయం సాధించాయని గొప్పలు చెప్పుకుని మురిసిపోయాడు ఆసిం మునీర్. అయితే క్షేత్ర స్థాయిలో జరిగింది వేరు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు కళ్లు బైర్లు కమ్మాయి. దీంతో పాకిస్తాన్ చివరకు అమెరికా శరణుజొచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అనూహ్యంగా తెరమీదకు తీసుకురావడంతో పాకిస్తాన్ బతికిపోయింది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డప్ లు ఇస్తోంది.భారత్ తో యుద్దంలో విజయం తమదే అంటోంది దాయాది దేశం.
ఆసిమ్ మునీర్…..ఇటీవల తెరమీదకు వచ్చిన పేరు. ఈయన ప్రస్తుతం పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి. నిన్నమొన్నటి వరకు మునీర్ గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆసిం మునీర్ పేరు పాకిస్తాన్ కు మాత్రమే పరిమితం. అయితే ఏప్రిల్ 22 నాటి పహెల్ గాం ఉగ్రదాడి తరువాత ఆసిమ్ మునీర్, క్యారెక్టర్ యావత్ ప్రపంచానికి పరిచయమైంది.
వాస్తవానికి ఆసిం మునీర్ సైనిక దుస్తుల్లో ఉన్న ఒక యుద్ధోన్మాది. పాకిస్తాన్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ కు ఎప్పటికప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చేవాడు. దీంతో ఆసిం మునీర్ మాటలను పాక్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ బండగా నమ్మేవాడు. కేవలం ఆసిం మునీర్ ఇచ్చిన సమాచారాన్ని నమ్మే.. పాకిస్తాన్ ను భారత్ తో యుద్దం అంచుల వరకు తీసుకెళ్లాడు షెహబాజ్ షరీఫ్. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరువాత ఆసిమ్ మునీర్ కు బుద్ధి వచ్చింది. అప్పటికి భారత్ – పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్దం ప్రారంభం కాలేదు. రెండు దేశాల మధ్య కేవలం ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులు, అందుకు భారత్ ప్రతీకార దాడులు.. పరిస్థితి అంతవరకే పరిమితమైంది.
ప్రధానంగా నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ బలగాలు చేసిన దాడితో పాకిస్తాన్ సైన్యానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై దాడి అంటే మామూలు విషయం కాదు. నూర్ ఖాన్ వైమానిక స్థావరం సమీపానే, పాకిస్తాన్ తన అణ్వస్త్రాలను దాచి పెట్టింది. దీంతో ఆసిం మనీర్ కు కాళ్ల కింద భూమి కదలినట్లయింది. అదే రోజు తెల్లవారుజామున పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఫోన్ చేసి.. ఆసిం మునీర్ చేతులెత్తేశాడు. సాక్షాత్తూ ఆర్మీ చీఫ్ యే చేతులెత్తేయడంతో షెహబాజ్ షరీఫ్ కు ఏం చేయాలో పాలుపోలేదు. అంతిమంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఫోన్ చేసి, భారత్ ను నిలువరించాలంటూ బతిమిలాడటం.. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ అనూహ్యంగా తెరమీదకు తీసుకురావడం జరిగిపోయాయి.
అయితే ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోకపోయితే, పరిస్థితి వేరేలా ఉండేది. భారత్ తో పాకిస్తాన్ పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైతే, ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అనే దేశం కనుమరుగు అవుతుందన్న విషయం జగమెరిగిన సత్యమే. అయినప్పటికీ సిగ్గూ ఎగ్గూ లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు ఆసిం మునీర్.
కాగా ఆసిం మునీర్ స్వంత డబ్బాపై భారత త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ తీవ్రంగా మండిపడ్డారు. ముందుగా అసత్యాలు ప్రచారం చేయడాన్ని ఆసిం మునీర్ మానుకోవాలన్నారు. భారత్ బలగాల దాటికి పాకిస్తాన్ సైన్యం కకావికలమైన సంగతి ఇటీవల యావత్ ప్రపంచం చూసిందన్నారు. రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగేలా ఆసిం మునీర్ మాట్లాడటాన్ని మానుకోవాలని అనిల్ చౌహాన్ హితవు పలికారు.
ఏమైనా పాకిస్తాన్ ది వంకర బుద్ధి. అబద్ధాలు ప్రచారం చేయడంలో , లేనిపోని డాంబికాలు ప్రదర్శించడంలో పాకిస్తాన్ కు మరే దేశమూ సాటి రాదు.