Trump on India – Pak War: భారత్- పాక్ యుద్ధం నేనే ఆపలేదు.. నిజం చెప్పిన ట్రంప్!
Donald Trump Said I wont stopped India – Pakistan War: భారత్- పాక్ మధ్య దాడులను తానే ఆపానని, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. అయితే ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై భారత్ లో పెద్ద ఎత్తున్న నిరసన వచ్చింది. దీనిపై స్వయంగా ప్రధాని మోదీ.. ట్రంప్ తో మాట్లాడారు. భారత్- పాక్ మధ్య యుద్ధంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదని క్లారిటీ ఇచ్చారు. ఇందులో అమెరికా ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు.
తాజాగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారంలో తన ప్రమేయం లేదని చివరకు వాస్తవాన్ని ఒప్పుకున్నారు. పరస్పరం చర్చల ద్వారా భారత్- పాక్ ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పారు. ఈ విషయమై నిన్న ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. “భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారంలో నా ప్రమేయం లేదు. ఇద్దరు తెలివైన నేతలు యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. లేదంటే ఆ పరిస్థితులు అణుయుద్ధానికి దారి తీసేవి. ఆ రెండు దేశాలూ అణుశక్తి కలిగినవి. అందుకే చర్చల ద్వారా ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయి.” అని ట్రంప్ తెలిపారు.