Published On:

NIA: ఎన్ఐఏ చేతికి విజయనగరం ఉగ్రకుట్ర కేసు

NIA: ఎన్ఐఏ చేతికి విజయనగరం ఉగ్రకుట్ర కేసు

Vizianagaram Terrorist Case: సంచలనం రేపిన విజయనగరం ఉగ్రకుట్ర కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు బదిలీ అయింది. సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ ఉగ్రకుట్ర కేసును ఏపీ ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. ఇద్దరు నిందితులు హైదరాబాద్, విజయనగరంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరపాలని కుట్ర ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. దీంతో సిరాజ్, సమీర్ ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు. కేసును ఎన్ఐఏకి బదిలీ చేయడంతో త్వరలోనే అధికారులు వీరిని అదుపులోకి తీసుకోనున్నారు.

అయితే విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద భావజాలం ఉన్న వారితో ఏర్పాటు చేసుకున్న సంబంధాలు, ఇతర కార్యకలపాలపై ఎన్ఐఏ కొన్ని నెలలుగా దృష్టి పెట్టింది. సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ తో కలిసి సిరాజ్ భారీ పేలుళ్ల కుట్రకు పథకం రూపొందించి.. అమలు చేసే దశలో దొరికిపోయారు. వీరు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలోని ఎన్ఐఏ అధికారులు మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. సౌదీలో ఉన్న ఇమ్రాన్ సహాయంతో పేలుళ్లకు సిరాజ్ ప్లాన్ చేశాడు. ఇమ్రాన్ పంపిన డబ్బులతో సిరాజ్ పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు.

ఇవి కూడా చదవండి: