AAP-Congress: రాహుల్ గాంధీకి షాక్.. కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పేసిన కేజ్రీవాల్!
Kejriwal Dismisses Talks Of AAP-Congress Alliance: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని చెప్పేసింది. రానున్న ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. ఇండియా కూటమి పార్టీలు ఆప్, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలలో కూటమితో కలిసి ఆప్ పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ ఖండించారు.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తు చివరి దశకు చేరుకుంది. కాంగ్రెస్ 15, ఇండడియా కూటమిలోని ఇతర పార్టీలకు 1 నుంచి 2, మిగిలిన వాటిలో ఆప్ పోటీ చేస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం’ అంటూ ఓ మీడియా సంస్థ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్‌పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రానున్న ఎన్నికల్లో సొంత బలంతోనే పోరాడతానని వెల్లడించింది.
ఇదిలా ఉండగా, ఆప్ ఇప్పటివరకు రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు రెండు విడతలను కలిపి 31మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. అయితే మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా.. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 36 సీట్లు గెలుపొందాల్సి ఉంటుంది.
అయితే, ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌పై ఆరోపణ వచ్చాయి. దీంతో ఆయనను జైలుకు తరలించగా.. ఇటీవల విడుదలయ్యారు. ఈ సమయంలో ప్రజల నుంచి విశ్వసనీయత సర్టిఫికెట్ వచ్చేవరకు సీఎం పదవిలో కొనసాగనని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆప్ నేత అతిశీ ఢిల్లీకి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.