Last Updated:

Delhi Assembly Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్.. కౌంటింగ్ హూరాహోరీ.. వెనుకంజలో కేజ్రీవాల్, సీఎం ఆతిశీ!

Delhi Assembly Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్.. కౌంటింగ్ హూరాహోరీ.. వెనుకంజలో కేజ్రీవాల్, సీఎం ఆతిశీ!

Delhi Assembly Election Results: ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ కౌంటింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 60 శాతం మంది తమ ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరగగా.. గెలుపు కోసం బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభమైంది.  తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం అసెంబ్లీ 70 స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ, ఆప్ హోరాహోరీగా తలపడుతున్నాయి.  తొలుత బీజేపీ 10, ఆప్ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగాయి.  కాసేపటికే ఆప్.. బీజేపీని వెనక్కి నెట్టేసింది. ఆప్ 17 స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 15 స్థానాల్లో, కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తాజాగా,  మళ్లీ బీజేపీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బీజేపీ 33 స్థానాల్లో ముందంజలో కొనసాగుంతుండగా.. ఆప్ 19 స్థానాల్లో, కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యంలోకి వచ్చాయి. ప్రస్తుతం కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది.

గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ముందంజలో ఉండగా.. ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజలో ఉన్నాడు. షాకుర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజలో ఉండగా.. కాల్ కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ, న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు.

ఇక, ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ హవా కొనసాగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36 ఉంటుంది. అయితే ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54శాతం మందిత ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో రెండు సార్లు అధికారంలో ఉన్న ఆప్ మూడోసారి అధికారంలోకి చూస్తుండగా.. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అధికారం బీజేపీ చేజిక్కుంచుకోవాలని భావిస్తోంది. అయితే, గత రెండు పర్యాయాల ఒక్క సీటు సంపాదించలేకపోయిన కాంగ్రెస్.. ఈ ఏడాది ఖాతా తెరవాలని ఆశిస్తోంది.