Delhi Election Results 2025: ఢిల్లీలో తొలి ఫలితం వచ్చేసింది.. బీజేపీ, ఆప్ ఎన్ని గెలిచాయంటే?
Delhi Election Results 2025: ఢిల్లీలో కొనసాగుతున్న హూరాహోరీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం వచ్చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీకి వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ అభ్యర్థి కుల్ దీప్ కుమార్ గెలుపొందారు. తన సమీప బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై 6,293 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది.
అలాగే, లక్ష్మీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయం సాధించారు. జంగ్‌పురలో 240 ఓట్ల వెనుకంజలో ఆప్ నేత ఉన్నారు. పత్‌పర్‌గంజ్‌లో ఆప్ నేత అవధ్ ఓజా ఓటమి చెందారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి 21,270 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.