kashmir tourism: దివాలా తీసిన కాశ్మీర్ టూరిజం

- ఉగ్రవాదులతో చేయి కలిపిన కొందరు స్థానికులు
- కాశ్మీర్ టూరిజంపై తీవ్ర ప్రభావం
- ఉపాది అవకాశాలను కోల్పోయిన కాశ్మీరీలు
kashmir tourism: ఉగ్రవాదం ప్రపంచ వినాశనానికి మరో రూపం. ఇది ఏదేశంలో ఉన్నా ఆదేశ ప్రజల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. దీన్ని కూకటి వేళ్లతో తొలగించడం తప్ప మరోదారి లేదు. ఇందుకు స్థానిక ప్రజల అవసరం ప్రభుత్వానికి ఎంతో ఉంది. ప్రభుత్వం తన బలగాలతో విరుచుపడ్డప్పుడు కొందరు స్థానికులు ఉగ్రవాదులకు అండగా ఉండటం నిజంగా విస్మయకరం. కొందరి నమ్మకాలు తీవ్రతరం అయినప్పుడు తాము అనుకున్నదే నిజమనుకున్నప్పుడు దానినే అమలు చేయాలనుకున్నప్పుడు వస్తుంది అసలు సమస్య. ఇలాంటి వారు సమాజానికి కంఠకులు. పహల్గాంలో జరిగింది ఇదే.

kashmir tourism collapse due to pahalgam terror attack 3
ఇస్లామిక్ తీవ్రవాదులు పహల్గాం దాడిలో మతం పేరిట ధారుణానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. ఎండాకాలంలో పిల్లలకు సెలవురావడం, అప్పుడే పెళ్లిళ్లు చేసుకుని సరదాగా గడపాలనుకుని కాశ్మీర్ కు చెరుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే వారిని టార్గెట్ చేసి దేశంలో అశాంతిని నెలకొల్పాలనుకున్నారు తీవ్రవాదులు. అందులో భాగంగానే ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్నారు. చుట్టూ దట్టమైన అడవిలోంచి తీవ్రవాదులు పర్యాటకులపై దాడిచేసి కాల్చిచంపారు. పైగా ముస్లింలు కానివారిని తెలుసుకుని మరీ చంపడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయడంతోపాటు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.

kashmir tourism collapse due to pahalgam terror attack 2
అప్పటివరకు టూరిస్టులతో కలకలలాడిన కాశ్మీర్ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న వెంటనే టూరిస్టులు కాశ్మీర్ ను కాలీ చేశారు. దాదాపు 97శాతం హోటల్స్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. 370ఆర్టికల్ ను తీసేసిన తర్వాత కాశ్మీర్ కు పర్యాటకులు పెరిగారు. అక్కడ ఉన్న ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. స్థానికులకు ఉపాది అవకాశాలు పెరిగాయి. పిల్లలు స్కూల్లకు వెళ్లసాగారు. ఈ పరిస్థితులు పెరిగిన ఆర్థికం తీవ్రవాదులకు తీవ్ర అసహనాన్ని కలిగించాయి. దీంతో మతాల మధ్య గొడవలు పెట్టాలని పథకం పన్నారు. అనుకున్నట్లుగానే పర్యాటకులపై దాడి చేశారు.

kashmir tourism collapse due to pahalgam terror attack 1
కాశ్మీర్ లోకి పర్యాటకం కోసం వెళ్లిన వారిని చాలామంది గైడ్ లు అదే రోజు పహల్గాం బాగుంటుందని అక్కడికి కావాలనే తీసుకెళ్లినట్లు బలగాల విచారణలో తేలింది. దీంతో తీవ్రవాదులకు స్థానికులు సహాయం చేసారని దాదాపు వందమందికి పైగా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్థానికులు, తీవ్రవాదులు కలిసి కాశ్మీర్ పర్యాటకానికి తీవ్ర అన్యాయం చేశారు. దీంతో స్థానికులకు ఉపాది అవకాశాలు తగ్గాయి. పహల్గాం దాడి కంటే ముందు కిక్కిరిసిన పర్యాటకులు ఇప్పుడు అటువైపుగా వెళ్లాలన్నా ఆలోచిస్తున్నారు. ఇది ఒకరకంగా కాశ్మీర్ ప్రజల ఆర్థికంపై దెబ్బ.

kashmir tourism collapse due to pahalgam terror attack
మరికొందరు స్థానికులు, తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. పహల్గాం దాడివలన పర్యాటకం లేకుండా పోయిందని వాపోతున్నారు. తీవ్రవాదులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము తీవ్రవాదానికి వ్యతిరేకమని ప్లెక్సీలను ప్రదర్శించారు.