Home / terrorism
ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం పై కొన్ని దేశాలు ఉమ్మడి పోరుకు ముందుకు రాకపోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీ - 20 పార్లమెంటరీ సమ్మిట్ ప్రధాని శుక్రవారం ప్రారంభించారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సీవో కమిటీ ఎన్నడూ వెనుకాడకూడదని స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలని షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమక్షంలో సూచించారు