Gujarat : గుజరాత్‌లో రూ.750 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం.. సీఈసీ రాజీవ్ కుమార్
ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో రికార్డు స్థాయిలో రూ.750 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
Gujarat Elections: ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో రికార్డు స్థాయిలో రూ.750 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ రికవరీ విలువ రూ.750 కోట్లు. రూ.27 కోట్ల నగదు, రూ.15 కోట్ల విలువైన మద్యం, రూ.60 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. 2017 ఎన్నికల్లో గుజరాత్‌లో రూ.27 కోట్ల విలువైన మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కుమార్ తెలిపారు.
ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించడం వల్లే వీటిని స్వాధీనం చేసుకున్నామని కుమార్ తెలిపారు. వడోదరలో పెద్ద ఎత్తున సోదాలు జరుగుతున్నాయని. దాదాపు 450 కోట్లు పట్టుబడే అవకాశం ఉందన్నారు. గుజరాత్‌లో రూ.171 కోట్ల విలువైన ఉచితపంపిణీలను సీజ్ చేశామని కుమార్ తెలిపారు. DRI, Income Tax, ATS గుజరాత్ పోలీసులు అందరూ చాలా శ్రద్ధగా పనిచేశారని ఆయన అన్నారు.గుజరాత్ కు పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు డామన్-డయ్యూ తమ సరిహద్దులను మూసివేసి సోదాలు నిర్వహించినట్లు కుమార్ వివరించారు.