Published On:

Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

Telangana: తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది.

 

అలాగే జూన్ 2 నాటికి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.