Home / Gujarat Elections
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడోసారి విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి.
గుజరాత్ ఎన్నికల సందర్భంగా పారిపోయిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు అడవుల్లో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ దాడితో అదృశ్యమైనట్టుగా చెబుతున్న గుజరాత్‌లోని దంతా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడిని పోలీసులు ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చారు. గుజరాత్ రెండో విడత పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఆయన బయటకు వచ్చారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్‌లో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇది 50 కి.మీ., పాటు సాగింది. ఇది బహుశా భారతదేశంలోనే అత్యంత పొడవైనది. ఇది 14 విధానసభ స్థానాల గుండా సాగింది
ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో రికార్డు స్థాయిలో రూ.750 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటివిడత పోలింగ్ ప్రారంభమైంది . నేడు 89 నియోజకవర్గాల ప్రజలు 788 అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
గుజరాత్‌లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో నిలచున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం గాంధీనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ 'సంకల్ప్ పత్ర' లేదా 'మేనిఫెస్టో'ని విడుదల చేసారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై దాడి చేసిన తరహాలోనే గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అదే ఓవైసీపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పై రాళ్ల దాడి చేశారు.