Kamal Haasan: తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను: కన్నడ భాష వివాదంపై కమల్ రియాక్షన్

Kamal Haasan Said He Won’t Apologize If I am Not Wrong: విశ్వ నటుడు కమల్ హాసన్‌పై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. కమల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆయన క్షమాపణలు చెప్పాలని వస్తున్న డిమాండ్డను కమల్ తోసిపుచ్చారు. తాను తప్పు చేస్తేనే క్షమాపణలను చెబుతాను అన్నారు. కాగా ఇటీవల థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్లో కమల్ మాట్లాడుతూ.. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందన్నారు.
ఆయన ఈ కామెంట్స్ ప్రస్తుతం కన్నడ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన కామెంట్స్‌ని కమల్ వెనక్కి తీసుకోవాలని, కన్నడిగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ చేస్తున్నారు. లేదంటే ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమాని కన్నడలో బ్యాన్ చేస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న కమల్ ఈ వివాదంపై స్పందించారు. “ఏ విషయంలో అయినా తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను. లేదంటే చెప్పను. అదే నా శైలి. భారత్ ప్రజాస్వామ్య దేశం.
నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతాను” అని అన్నారు. ఈ విషయంలో ప్రజలు జొక్యం చేసుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. కన్నడ భాషపై వస్తున్న వివాదంలో తను క్షమాపణలు చెప్పేది లేదని ఆయన తెల్చేసారు. మరోవైపు కమల్ తీరుపై కన్నడ అధికార, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రం స్పందించింది. మే 30 లోగా కమల్ క్షమాపణలు చెప్పాలని.. లేదంటూ ఆయన థగ్ లైఫ్ సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ కమల్ మాత్రం తాను క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చేస్తున్నారు.