Last Updated:

Manipur Violence: మణిపూర్ హింసాకాండపై అమిత్ షా నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్

Manipur Violence: గత కొద్ది రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితులను చక్కబెట్టేందుకు చూసినా కానీ అవేమి పెద్దగా పరిస్థితిని మార్చలేకపోయాయి.

Manipur Violence: మణిపూర్ హింసాకాండపై అమిత్ షా నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్

Manipur Violence: గత కొద్ది రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితులను చక్కబెట్టేందుకు చూసినా కానీ అవేమి పెద్దగా పరిస్థితిని మార్చలేకపోయాయి. ఎక్కడో ఒకచోట హింస చెలరేగుతూనే ఉంది. అయితే అసలు మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం జరగింది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి నిత్యానంద్ రాయ్, ప్రహ్లాద్ జోషి, జేపీ నడ్డా, కాంగ్రెస్ నుంచి ఓ ఇబోబీ సింగ్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి డెరెక్ ఓబ్రెయిన్, సి. మిజో నేషనల్ ఫ్రంట్ నుండి లాల్‌సంగా, బిజెడి నుండి పినాకి మిశ్రా, ఎఐఎడిఎంకె నుండి ఎం తంబిదురై, డిఎంకె నుండి తిరుచ్చి శివ, ఆర్జెడి నుండి మనోజ్ ఝా, సమాజ్ వాదీ పార్టీ నుండి రామ్ గోపాల్ యాదవ్, ఆప్ నుండి సంజయ్ సింగ్ మరియు ఇతర రాజకీయ పార్టీల నాయకులు హాజరయినట్టు సమాచారం.

ఆగని హింస(Manipur Violence)

మణిపూర్ లో మే 3 నుంచి వరసగా హింసాత్మక ఘటనలు, కాల్పులు జరగుతుండటంతో దాదాపు 120 మంది మరణించారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 25 వరకు పొడగించింది. మెయిటీలకు కుకీలు వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ రాష్ట్రంలో ఏదో ఒకచోట రోజూ దాడులు చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఈ ఘర్షణల్లో 120 పైగా మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. అమిత్ షా స్వయంగా మణిపూర్ వెళ్లి అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిటీ నాయకులతో చర్చించి శాంతిస్థాపన కోసం పిలుపునిచ్చారు. అయినా పరిస్థితి చక్కబడటం లేదు. దీనికి తోడు మయన్మార్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు హింసను మరింతగా ప్రేరేపిస్తున్నారు. ఈ హింసపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతా జరుగుతున్నా ప్రధాని మోడీ ఏం ఎరుగనట్టు ఉంటున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.