Last Updated:

KTR : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారమే.. కేటీఆర్

: ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయాడని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్బీ నియోజక వర్గంలో నిర్వహించిన బీఆర్ఎస బూత్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు.

KTR : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారమే.. కేటీఆర్

 KTR : ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయాడని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్బీ నియోజక వర్గంలో నిర్వహించిన బీఆర్ఎస బూత్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆరు నెలలకు ఒక సీఎం..( KTR )

ఓటుకు నోటు కేసులో దొరికి పోయిన వ్యక్తి.. రాష్ట్రాన్ని కూడా అమ్మేయడని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే.. రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు. కర్నాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చాలా తప్పు చేశామని అంటున్నారని.. వాళ్లే వచ్చి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయెద్దని ప్రచారం చేస్తున్నారని గుర్తుచేశారు. అప్పడు తెలంగాణలో కరెంట్ ఉంటే వార్త.. ఇపుడు కరెంట్ పోతే వార్త. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేస్తే ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి వస్తాడని చెప్పారు.

రాజీనామా చేయకుండా పారిపోయాడు..

తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీకి ఓటు వేస్తే.. అది మురికి కాల్వలో వేసినట్టేనన్నారు. బీజేపీని ప్రజలెవ్వరు నమ్మే పరిస్తితుల్లో లేరని.. ఆ పార్టీకి ఓటు వేసి ఆగం కావద్దని ప్రజలకు సూచించారు. నాగోలు నంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ కు మెట్రో సేవలు తెస్తామని తెలిపారు. తెలంగాణాను సీఎం కేసీఆర్ అగ్ర బాగంలో నిలబెట్టారని.. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు.