Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ” మూవీ@40 ఇయర్స్..
మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటరీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రి లోకి అడుగు పెట్టి ఎంపరర్ ఆఫ్ తెలుగు సినిమా అనిపించుకున్నారు. ఇక ఆయన సినీ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాలలో ‘ఖైదీ’ ఒకటని చెప్పాలి. 1983లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆ సినిమాని కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటరీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రి లోకి అడుగు పెట్టి ఎంపరర్ ఆఫ్ తెలుగు సినిమా అనిపించుకున్నారు. ఇక ఆయన సినీ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాలలో ‘ఖైదీ’ ఒకటని చెప్పాలి. 1983లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆ సినిమాని కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. హాలీవుడ్ చిత్రం ‘ఫస్ట్ బ్లడ్’ ఆధారంగా రూపొందిన ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి.. చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూలు రాబట్టి ఇండస్ట్రి హిట్ గా అయ్యింది. ఇప్పటికీ తన కెరీరి లో ఆ మూవీని స్పెషల్ మూవీగా చిరు చెప్పుకుంటారు. కాగా నేటికీ ఆ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి అయ్యింది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో.. ‘’ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది.
నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి
ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ,
ఆ చిత్ర… pic.twitter.com/raY4AOTAoH— Chiranjeevi Konidela (@KChiruTweets) October 28, 2023
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఊహించని రీతిలో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలకి ఓకే చెప్పేశారు. కళ్యాణ్ కృష్ణతో 156, వశిష్ట తో 157 వ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ తో ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టి వశిష్ట మూవీ ముందు పట్టాలెక్కుతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గానే ఈ చిత్ర పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.
అయితే ఈ సినిమాకి స్పెషల్ గా ఓల్డ్ ట్రెండ్ ని స్టార్ట్ చేసినట్లు కనబడుతుంది. ముందుగా సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయడం అనేది తెలుగు చిత్రసీమలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే… ఆ పద్ధతికి కొన్ని రోజులుగా బ్రేకులు పడ్డాయి. మళ్ళీ ఆ సంప్రదాయాన్ని మెగా 156 చిత్ర బృందం తీసుకురావడం గమనార్హం. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు వశిష్ఠ సమక్షంలో.. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు.