Published On:

Telangana Formation Day on June 2nd: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించాలి : బీఆర్ఎస్ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపు

Telangana Formation Day on June 2nd: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించాలి : బీఆర్ఎస్ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపు

KTR calls for grand state formation celebrations on June 2nd: జూన్ 2వ తేదీన తెలంగాణ భ‌వ‌న్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు ఘనంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అన్ని జిల్లా కార్యాలయాలతోపాటు నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో జాతీయ జెండా, పార్టీ పతాకాన్ని ఎగురవేసి పెద్దఎత్తున సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులంతా పాల్గొనాలన్నారు. ప్రజలతో కలిసి అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు.

 

14 ఏళ్ల అలుపెరగని పోరాటం..

14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జూన్ 2న పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి పాల్గొని జాతీయ జెండా, పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. వేడుకల్లో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ జెండాతోపాటు పార్టీ జెండాలను ఎగరేసి సంబురాలు నిర్వహించాలని కోరారు. జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో జాతీయ పతాకంతోపాటు గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి: