Published On:

KTR on Miss England Milla Maggie: మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీకి చేదు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నాం : కేటీఆర్‌

KTR on Miss England Milla Maggie: మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీకి చేదు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నాం : కేటీఆర్‌

KTR apologize Miss England Milla Maggie: హైదరాబాద్‌‌లో జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి పోటీల్లో కంటెస్టెంట్‌లను వేశ్యలా చూస్తున్నారని, ఇది తనకు నచ్చలేదని, అందుకే పోటీల నుంచి తాను తప్పుకుంటున్నానని మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఆమెకు చేదు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నానని తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు.

 

ప్రపంచ సుందరీమణులు లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళల పట్ల వివక్షాపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీనీ ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలన్నారు. మిల్లా మ్యాగీ మీరు ఒక బలమైన మహిళ అని కొనియాడారు. మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు తాము చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని చెప్పారు. ఇక్కడ మహిళలను పూజిస్తామని, గౌరవిస్తామన్నారు. వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తామన్నారు. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు తెలంగాణ మట్టిలో పుట్టినవారేనని కేటీఆర్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో రాసుకొచ్చారు.

 

దురదృష్టవశాత్తు మీరు ఎదుర్కొన్న చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదన్నారు. మీరు త్వరగా బాధ నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఏ ఒక్క మహిళ, ఆడపిల్ల ఇలాంటి అనుభవాలను ఎదుర్కోకూడదని ఓ అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండించారు. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి: