Nara Lokesh : ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నా – నారా లోకేష్
స్కిల్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తప్పు చేశారని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నానని నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో లోకేశ్ మాట్లాడారు.
Nara Lokesh : స్కిల్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తప్పు చేశారని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నానని నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
చంద్రబాబును జైలులో బంధించి ఇవాళ్టికి 50 రోజులైందని.. ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని లోకేశ్ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారన్నారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు.. కొత్త ఆధారం ఒక్కటైనా ప్రజల ముందు పెట్టారా? అని మండిపడ్డారు. స్కిల్, ఫైబర్‌నెట్ ఏ కేసులో నైనా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా? పార్టీ ఖాతాకు డబ్బులు వచ్చాయని ఒక్క ఆధారమైనా చూపారా?ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నానన్నారు.
స్కిల్ కేసులో మా కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. మా ఆస్తులు, ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామణి తెలిపారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నామని.. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడటం సహజమే. చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని వైకాపా నేతలు బాహాటంగా చెబుతున్నారు. కేసుతో సంబంధం లేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైకాపాకు చెందిన మహిళా మంత్రి వ్యాఖ్యానించారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి నా తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేస్తామంటారా? అని ఫైర్ అయ్యారు.
చంద్రబాబును బయటకు రానీయకుండా లాయర్ ఫీజుకు రూ.పదేసి కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. రైతుల కోసం కాకుండా బస్సు యాత్ర పేరుతో గాలి యాత్ర చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. సైకో జగన్‌ను వదిలిపెట్టం.. ప్రజల తరఫున పోరాడుతాం’’ అని లోకేశ్ స్పష్టం చేశారు.