Published On:

Budget Trip in Hyderabad: మరో 6 రోజుల్లో స్కూల్స్ ఓపెన్.. తక్కువ బడ్జెట్‌లో హైదరాబాద్‌లో చూడాల్సిన ప్రదేశాలివే..!

Budget Trip in Hyderabad: మరో 6 రోజుల్లో స్కూల్స్ ఓపెన్.. తక్కువ బడ్జెట్‌లో హైదరాబాద్‌లో చూడాల్సిన ప్రదేశాలివే..!

The Perfect Spot For Your Budget Trip in Hyderabad: స్కూల్ విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ మరో 6 రోజుల్లో ముగియనున్నాయి. ఈ తరుణంలో తక్కువ బడ్జెట్‌లో మీ ముందుకు ఓ టూర్ ప్యాకేజీ తీసుకొస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్న వారికి సెలవులు దొరకని పరిస్థితుల్లో తమ పిల్లలను తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలు, తక్కువ బడ్జెట్‌లో చూసేందుకు హైదరాబాద్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్. గతంలో హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలిచేవారు.

 

హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది చార్మినార్. దీనికి 1591లో మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఆ నిర్మాణం పక్కనే మక్కా మసీదు ఉంది. ఇది దేశంలోనే పురాతన మసీదులలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతి రోజూ ఉదయం 9.30 నిమిషాల నుంచి సాయంత్రం 5.30 నిమిషాలకు వరకు ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఒకరికి రూ.5 ఉండగా.. విదేశీయులకు రూ.100 ఉంటుంది.

 

చార్మినార్ నుంచి కొంతదూరం వెళ్తే అద్భుతమైన కట్టడం గోల్కొండ కోట ఉంటుంది. ఇది ఒకప్పుడు వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉండేదని చెబుతుంటారు. దీనిని కాకతీయుల రాజులు నిర్మించారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాలకు వరకు ఓపెన్ ఉండగా.. ఒక్కరికి రూ.15 ఎంట్రీ ఉంటుంది. విదేశీయులకు మాత్రం రూ.200 కేటాయించారు.

 

అలాగే, చౌమహల్లా ప్యాలెస్ చూడదగ్గ ప్రాంతం. దీనిని అసఫ్ జాహీ రాజవంశం పాలనా కేంద్రంగా ఉండగా.. ఆ తర్వాత నిజాంలకు నివాసంగా మారింది. దీనిని వారంలో 6 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎంట్రీ ఉంటుంది. ఒక్క శుక్రవారం మాత్రమే మూసివేస్తారు.

 

ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంలలో సాలర్ జంగ్ మ్యూజియం ఒకటి. అనేక దేశాల నుంచి సేకరించిన వస్తువులు ఇందులో ఉంటాయి. ఔరంగజేబు నుంచి నిజాం వరకు ఉపయోగించిన వస్తువులు ప్రదర్శనలో కనిపిస్తాయి. ప్రతీ శుక్రవారం మ్యూజియానికి హాలిడే ఉండగా.. మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఎంట్రీ ఫీజు విషయానికొస్తే.. ఒకరికి రూ.10 ఉండగా.. విదేశీయులకు రూ.150 ఉంది.