Published On:

Weather Updates: వచ్చే ఐదు రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Weather Updates:  వచ్చే ఐదు రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Rain Alert To Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే రానున్న ఐదు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు.

 

నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీలోని అన్ని జిల్లాల్లో వచ్చే ఐదురోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణశాఖ చెప్పింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విశాఖ, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. అలాగే భారీ ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక తెలంగాణలోనూ వచ్చే ఐదురోజులపాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగాం, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే పలుచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: