Medaram Jatara 2026: మేడారం జాతర తేదీలు ఖరారు.. ఎప్పటినుంచంటే?

Medaram Jatara 2026 Dates Announced: ఆసియాలోనే అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీలు ఖరారు అయ్యాయి. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది. 2026 లో జరగబోయే మేడారం జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతర జరగనుందని పేర్కొన్నారు. 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ గద్దెకు విచ్చేసి, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు వస్తారు.
అలాగే, 2026 జనవరి 29వ తేదీన సాయంత్రం సమ్మక్క అమ్మవారు గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకునే ప్రత్యేక రోజుగా ప్రకటించారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లు వనప్రవేశంతో జాతర ముగింపు ఘట్టంతో పూర్తవుతుందని అన్నారు. మేడారం జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. అలాగే ఈ జాతరకు విదేశాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తారు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుకు కలగకుండా ఏర్పాట్ల చేస్తున్నామని పూజారుల సంఘం తెలిపింది.