Published On:

Actor Fish Venkat: వెంటిలేటర్‌పై సినీనటుడు.. సాయం కోసం విజ్ఞప్తి

Actor Fish Venkat: వెంటిలేటర్‌పై సినీనటుడు.. సాయం కోసం విజ్ఞప్తి

Tollywood Actor Fish Venkat: సమ్మక్క-సారక్క సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఫిష్ వెంకట్.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతన్న ఫిష్ వెంకట్ గతంలో డయాలసిస్ చేయించుకోవడంతో ఆరోగ్యం మెరుగుపడింది. అంతా బాగుంది అనుకునే లోపు.. మళ్లీ ఆరోగ్యం క్షిణించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థతి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 

ప్రస్తుతం నటుడు ఫిష్ వెంకట్ ఆపస్మారక స్థితిలో ఉన్నారని..  ఎవరినీ గుర్తించలేకుండా ఉన్నారని ఆయన కుటుంబు సభ్యులు చెబుతున్నారు. ఆయనకు కిడ్నీ మారిస్తే తప్ప బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన కుటుంబానికి కిడ్నీ మార్పించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని ఆయన కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. గతంలో ఫిష్ వెంకట్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చికిత్స కోసం రూ.2 లక్షలు సాయం చేసిన సంగతి తెలిసిందే.

 

ఇదిలా ఉండగా, సమక్క-సారక్క సినిమాతో ఫిష్ వెంకట్ పరిశ్రమలో అడుగుపెట్టాడు. పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాటి నుంచి అనేక బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు. చివరగా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో ఫిష్ వెంకట్ కనిపించారు. అనారోగ్యం కారణంగా ఆయన సినిమాలు తగ్గించేశారు. సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: