Last Updated:

YS Sharmila: పోలీసుల్ని నెట్టేసి .. మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న షర్మిల

YS Sharmila: తనను అడ్డుకుంటున్న పోలీసులపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసుల్ని నెట్టివేసి.. ఓ మహిళ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు.

YS Sharmila: పోలీసుల్ని నెట్టేసి .. మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న షర్మిల

YS Sharmila: తనను అడ్డుకుంటున్న పోలీసులపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసుల్ని నెట్టివేసి.. ఓ మహిళ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. దీంతో వివిధ సెక్షన్ల కింద షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

చేయి చేసుకున్న షర్మిల..

తనను అడ్డుకుంటున్న పోలీసులపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసుల్ని నెట్టివేసి.. ఓ మహిళ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. దీంతో వివిధ సెక్షన్ల కింద షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

వైఎస్ షర్మిల నివాసం.. లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను నెట్టుకుంటు ముందుకెళ్లారు. షర్మిలను అడ్డుకునే క్రమంలో.. మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించారు. పోలీసులకు షర్మిలకు జరిగిన వాగ్వాదంలో ఆమె పలుమార్లు పోలీసుల్ని నెట్టివేశారు. పోలీసులపై చేయి చేసుకున్నందుకు.. షర్మిలను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.

పోలీసులు తోసుకుంటూ.. ముందుకు వెళ్లిన షర్మిలను నిలువరిచే ప్రయత్నం చేశారు. కోపంతో కారుదిగిన షర్మిల పోలీసుల్ని నెట్టేయటం..దురుసుగా ప్రవర్తిస్తూ హంగామా చేశారు. పోలీసులు తనను ముందుకు కదలనీయకపోవటంతో షర్మి అక్కడే రోడ్డుమీదనే బైఠాయించారు.

ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నా పనులు చేసుకోకుండా అడ్డుకునే అధికారం మీకెక్కడిది? అంటూ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు విధి నిర్వహణలో ఉన్న మహిళ కానిస్టేబుల్ చంప చెళ్లుమనిపించారు షర్మిల. దీంతో పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేయనున్నట్లుగా తెలుస్తోంది.