Last Updated:

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల లేఖాస్త్రం..

ఏపీ సీఎం జగన్ కు చెల్లెలు వైఎస్ షర్మిల తాజాగా లేఖాస్త్రం సంధించారు . ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ సందేహాలు'కు సమాధానం చెప్పాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంవత్సరాల తరబడి అందుతున్న పధకాలను ఎందుకు నిలిపివేసారని ఆమె ప్రశ్నించారు.

YS Sharmila:  సీఎం జగన్ కు  వైఎస్ షర్మిల లేఖాస్త్రం..

 YS Sharmila: ఏపీ సీఎం జగన్ కు చెల్లెలు వైఎస్ షర్మిల తాజాగా లేఖాస్త్రం సంధించారు . ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న ‘నవ సందేహాలు’కు సమాధానం చెప్పాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంవత్సరాల తరబడి అందుతున్న పధకాలను ఎందుకు నిలిపివేసారని ఆమె ప్రశ్నించారు.

షర్మిల అడిగిన ప్రశ్నలేమిటంటే..( YS Sharmila)

1) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా? 2) సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారు? 3) 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు ? 4) ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం రాష్ట్రంలో ఎందుకు నిలిచిపోయింది? 5) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? 6) దళిత, గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు? 7) ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా? 8) దళిత డ్రైవర్ ను చంపి సూట్ కేసులో డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? 9) స్టడీ సర్కిల్స్ కి నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?. అంటూ తాను రాసిన లేఖలో షర్మిల ప్రశ్నించారు.