YS Sharmila: ఆస్తి వ్యవహారం.. మాజీ సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila Shocking Comments On Ys Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో ఆస్తులు వ్యవహారంపై మాట్లాడారు. మాజీ సీఎం జగన్ తన తల్లిపై కేసు వేసిన కొడుకుగా.. మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జనగ్ చరిత్రలో నిలిచిపోతారంటూ విమర్శలు చేసింది.
ఇప్పటివరకు తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదని, సరస్వతి పవర్ షేర్ల ఎంఓయూపై వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా సంతకాలు చేశారన్నారు. కాగా,విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను గిఫ్ట్‌డీడ్ కింద జగన్ అందించారన్నారు. అయితే ఇచ్చిన షేర్లను మళ్లీ తనకే కావాలని కోర్టుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు విశ్వసనీయ ఉందో? లేదో? వైసీపీ నాయకులే ఆలోచించాలన్నారు.
అంతకుముందు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై అవినాష్ రెడ్డి బయట తిరుగుతూ సాక్ష్యాలు తారుమూరు చేస్తున్నారని గుర్తుచేశారు. మాజీ మంత్రి వివేకాను ఆయన సొంత కూతురు సునీతనే హత్య చేయించిందని ఓ ఉన్నతాధికారిని భయపెట్టి రిపోర్టు రాసినట్లు ఆరోపించారు.
ఈ కేసులో సాక్ష్యాలుగా ఉన్న ప్రతి ఒఖ్కరూ ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతున్నారని బాంబ్ పేల్చారు. అందుకే సునీతకు కూడా ప్రాణహాని ఉందని చెప్పారు. అందుకే బెయిల్‌పై వచ్చి సాక్ష్యాలను కొంతమంది తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని, ఇలాంటి వారు జైల్లోనే ఉండాలని నిలదేశారు.