Home / ys sharmila
YS Sharmila: ప్రశ్నపత్రాల లీకేజీపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
YS Sharmila: హైదరాబాద్ లోని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు.
ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత ప్రదర్శిస్తుందని ఆరోపిస్తూ..
YS Sharmila: తెలంగాణలో మాట్లాడే హక్కు లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై పలు విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు రోజు ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. షర్మిలను చూస్తే జాలి వేస్తుందని కడియం వ్యాఖ్యానించారు.
YS Sharmila: తెరాస ప్రభుత్వంపై మరోసారి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తనతో తనతో కలిసి పాదయాత్ర చేయాలంటూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపారు. ప్రభుత్వం కావాలనే తన పాదయాత్రను అడ్డుకుంటోందని ఈ సందర్భంగా షర్మిల ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Ys Sharmila: తెలంగాణలో ముందుస్తు ఎన్నికలపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని షర్మిల అన్నారు. ఈ విషయం కేసీఆర్ కు బాగా తెలుసని.. ముందస్తు ఎన్నికలకు వెళితే కేసీఆర్ నష్టపోతారని ఆమె అన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. వైఎస్ వివేకా హత్య కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28 నుంచి […]
Bro. Anil Kumar : ఏపీ సీఎం జగన్ బావ, బ్రదర్ అనిల్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండునని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని అనిల్ చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖ జిల్లా భీమిలి మండలంలో క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్ లో నిర్వహించిన ప్రార్ధన కూడికలో పాల్గొన్న బ్రదర్ అనిల్… ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని తమ స్వార్ధం కోసం […]
పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా తనను ఇంటి నుంచి పోలీసులు బయటకు రానివ్వడం లేదని వైఎస్ షర్మిల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.