Home / Uncategorized
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారయింది. ఏపీలో ఈ నెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. ముందుగా అన్నవరంలో పూజలు చేసి యాత్రకు బయలుదేరనున్నారు.
:తనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 5న అయోధ్యలో జరగాల్సిన తన ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు. ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించడంతో ఈ ప్రకటన వెలువడింది.
మహారాష్ట్రలోని అకోలాలో శనివారం జరిగిన మత ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 103 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. శాంతి భద్రతలను కాపాడేందుకు గాను ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ బంద్ చేసారు.
తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల( Dost) నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచిందని, పరిస్థితి అవసరమైతే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మొత్తం ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని, ప్రస్తుత పాలసీ రేటు ఇప్పటికీ అనుకూలంగానే ఉందని ఆయన తెలియజేశారు.
గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా.. రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రిటైల్ ద్రవ్యోల్బణం మరోమారు కోరలు చాచింది. గత నెల జనవరిలో మూడు నెలల గరిష్టానికి 6.52 శాతంగా నమోదయింది.
హెచ్ 1బీ, ఎల్ 1 వీసా పునరుద్దరణ ప్రక్రియ సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ‘ డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ’ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
తెలుగు దేశం పార్టీ పై వైఎస్సీర్సీపీ నేత లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదన్నారు.