Konda Surekha: రాష్ట్రాన్ని పాస్టిక్ రహితం చేయాలి.. మంత్రి కొండా సురేఖ
Telangana: తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణానికి హాని చేయొద్దని పిలుపునిచ్చారు. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే థీమ్ తో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన పోస్టర్లను తెలంగాణ పీసీబీ మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి, పలువురు అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
కాగా పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి ఈ పోస్టర్లతో అవగాహన పెంచేలా లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. స్థిరమైన పద్ధతులను అవలంభిచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం, సరైన వ్యర్థాల నిర్వహణ అవసరాన్ని మంత్రి ప్రధానంగా వివరించారు. పర్యావరణ పరిరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని, వ్యక్తులు పాల్గొనేలా ప్రోత్సహించి ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అన్నారు.