Published On:

Rain Alert: నేడు, రేపు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert:  నేడు, రేపు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert Next Two Days to Telangana: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు భూపాలపల్లి, ముగులు, కొత్తగూడెంలలో భారీ వర్షాలు పడొచ్చని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే ఏపీలోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.

 

కాగా, తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో చాలా ప్రాంతాల్లో ఎండ ప్రభావం తగ్గి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దీంతో రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉంది. సుమారు 30 రోజుల తర్వాత హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదైంది.

 

ఈ మేరకు సుమారు 15 మి.మీ. నుంచి 27 మి.మీ. వరకు వర్షపాతాన్ని నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో అత్యధికంగాదాదాపు 27 మి.మీ వర్షపాతం నమోదైంది. బీహెచ్ఈఎల్, రామచంద్రాపురంలలో 27.3 మి.మీ., టోలిచౌకి, కార్వాన్ లలో 26.4 మి.మీ., ముషీరాబాద్ లో 24.8 మి.మీ., కుత్బుల్లాపూర్‌లోని మహాదేవ్‌పురా, గజులరామారంలలో 25.5 మి.మీ., జూబ్లీహిల్స్, షేక్‌పేట్ లలో 24.5 మి.మీల వర్షపాతం నమోదైంది.

 

ఇక, సిద్దిపేటలో అత్యధికంగా 63.3 మి.మీ వర్షపాతాన్ని నమోదవ్వగా.. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి 61.5 మి.మీ, సంగారెడ్డిలోని గుమ్మడిదాలలో 58.8 మి.మీ, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 56.3 మి.మీ, మెదక్ జిల్లాలోని తుప్రన్ మండలంలో 51.3 మి.మీ, సూర్యాపేటలోని తుంగతుర్తి మండలంలో 50 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి: