Published On:

Fire Accident: ఏఐజీ ఆస్పత్రిలో మంటలు.. అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

Fire Accident: ఏఐజీ ఆస్పత్రిలో మంటలు.. అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

AIG Hospital: హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి ఎదురుగా పార్క్ చేసిన అంబులెన్స్ లో మంటలు చెలరేగి ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వ్యాపించాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో రోగులు ఆందోళన చెందారు. అగ్నిప్రమాదం ఘటనతో ఏఐజీ ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.