Traffic Rules: బోనాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Bonalu: గోల్కొండ బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. బోనాల ప్రత్యేక పూజల సందర్భంగా ఈనెల 29, జులై 3,6,10, 13, 17,20,24 తేదీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
గోల్కొండలోకి ప్రవేశించే రామ్ దేవ్ గూడ మక్కయి దర్వాజా, లంగర్ హౌజ్ ఫతేదర్వాజా, సెవెన్ టూంబ్స్ బంజారా దర్వాజా వైపు నుంచి ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదని జాయింట్ కమిషనర్ తెలిపారు. అయితే ఈ మార్గాల ద్వారా వచ్చే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జోయల్ డేవిస్ కోరారు.