Published On:

Massive fire Accident: ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు!

Massive fire Accident: ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు!

Massive fire Accident in Uttar Pradesh at Noida: ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడాలో సెక్టార్ 2లోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కొంతమంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బిల్డింగ్ మొత్తం దట్టమైన నల్లటి పొగ, మంటలు పెద్ద పెద్దగా ఎగసిపడుతుండటంతో అదుపుచేసేందుకు పైర్ సిబ్బందికి సైతం కష్టంగా మారింది. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఇవి కూడా చదవండి: