Published On:

GandhiBhavan: గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ

GandhiBhavan: గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ

BreakingNews: హైదరాబాద్‌ గాంధీభ‌వ‌న్‌లో మలక్‌పేట్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలి ఉల్లాఖాన్, మలక్‌పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య తొపులాట జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ డీసీసీ పదవి కావాలని కోరడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు డోర్ పెట్టుకొని నెట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం ,తోపులాట చోటుచేసుకుంది. గాంధీభవన్‌లోనే ఇరు వర్గాలు గొడవకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కూడా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలపడం, గొడవలు పడటంతో అధిష్టానం సీరియస్ అయింది. మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: