Published On:

Anchor Suicide: కుటుంబ కలహాలతో టీవీ యాంకర్ ఆత్మహత్య

Anchor Suicide: కుటుంబ కలహాలతో టీవీ యాంకర్ ఆత్మహత్య

Hyderabad: కుటుంబ కలహాలతో ఓ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్ లోని చిక్కడపల్లి పీఎస్ పరధిలోని జవహర్ నగర్ లోని శీలం రెసిడెన్సీలోని ఓ ఇంట్లో తన కూతురు సేన అరణ్యతో కలిసి ఉంటుంది. 2014 లో భర్త క్రాంతి కిరణ్ తో విడాకులు కావడంతో కొన్ని రోజులుగా తల్లిదండ్రులతో కలిసి ఉంది. ప్రస్తుతం నాలుగేళ్లుగా జవహర్ నగర్ లో కూతురితో కలిసి జీవిస్తోంది.

 

విడాకులు జరిగినా భార్యాభర్తల మధ్యయ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మనస్థాపానికి గురైన స్వేచ్ఛ అపార్ట్మెంట్ లోని పెంట్ హౌస్ లో నిన్న రాత్రి 8.30 గంటలకు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ఇవి కూడా చదవండి: