Published On:

Golconda Bonalu: కన్నుల పండుగగా గోల్కొండ బోనాల జాతర

Golconda Bonalu: కన్నుల పండుగగా గోల్కొండ బోనాల జాతర

Aashada Bonalu Festival: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాడ మాస బోనాల సందడి మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో బోనాల సమర్పణ కన్నుల పండుగగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోల్కొండ కోటకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర రెండో పూజ ఆదివారం కలిసి రావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

 

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలతో గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక కళ నెలకొంది. ఈనెల 26 గురువారం నుంచి ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల జాతర మొదలైంది. ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి 9 రకాల పూజలు నిర్వహించనున్నారు. జులై 24న తిరిగి గోల్కొండ కోటలోనే బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.

ఇవి కూడా చదవండి: