Published On:

Asaduddin Owaisi: బీజేపీకి వ్యతిరేకంగా అసదుద్దీన్ పొత్తు చర్చలు

Asaduddin Owaisi: బీజేపీకి వ్యతిరేకంగా అసదుద్దీన్ పొత్తు చర్చలు

AIMIM Alliance In Bihar Elections: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాకుండా నిరోధించడమే లక్ష్యంగా తమ పార్టీ బీహార్ లోని ప్రతిపక్ష మహాఘటబంధన్ నాయకులను సంప్రదించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. తమ పార్టీ రాష్ట్ర చీఫ్ అఖ్తరుల్ ఇమాన్, కాంగ్రెస్, ఆర్జేడీ ఇతరులతో కూడిన మహఘటబంధన్ నాయకులను సంప్రదించారని బీజేపీ దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ఆసక్తిని వ్యక్తం చేశారని ఓవైసీ ఇవాళ అన్నారు. “మా రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్, మహఘటబంధన్ లోని కొంతమంది నాయకులతో మాట్లాడారు. బీహార్ లో బీజేపీ లేదా ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావాలని మేం కోరుకోవడం లేదు. ఇప్పుడు బీహార్ లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావాలా? వద్దా? అనేది ఈ రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంది” అని ఓవైసీ తెలిపారు.

 

బీహార్ లోని సీమాంచల్ ప్రాంతంలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఎంఐఎం 2022లో దాని ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఆర్జేడీలో చేరడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తమ పార్టీ సీమాంచల్ నుంచే కాకుండా బయట కూడా అభ్యర్థులను నిలబెడుతుందని ఓవైసీ అన్నారు. “వారు తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేకుంటే, తాము ప్రతిచోటా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. అంతకుముందు బీహార్ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను వ్యతిరేకిస్తూ ఓవైసీ భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. “ఓటరు జాబితాలో నమోదు కావడానికి, ప్రతి పౌరుడు ఇప్పుడు వారు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో నిరూపించే పత్రాలను మాత్రమే కాకుండా, వారి తల్లిదండ్రులు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో కూడా చూపించాల్సి ఉంటుంది. ఉత్తమ అంచనాలు కూడా జననాలలో మూడింట ఒక వంతు మాత్రమే నమోదు అయ్యాయని చెబుతున్నాయి. చాలా ప్రభుత్వ పత్రాలు లోపాలతో నిండి ఉన్నాయి”. అని అన్నారు.

 

ఇవి కూడా చదవండి: