Published On:

10th Results : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. ఎన్ని గంటలకంటే?

10th Results : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. ఎన్ని గంటలకంటే?

Telangana 10th Results : రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. టెన్త్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి బుధవారం (రేపు) మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు. విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు జరిగాయి. దాదాపు 5లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై క్లారిటీ వచ్చింది. దీంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఫలితాల కోసం results.eenadu.net, https://bse.telangana.gov.in/లో పొందవచ్చు.

 

మార్కుల మెమోలు ఇలా..
ఇప్పటి వరకు టెన్త్ సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతోపాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ, ఇప్పటి నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్‌ పొందుపరుస్తారు. చివరకు విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా అనే వివరాలను పేర్కొంటారు. బోధనేతర కార్యక్రమాల (కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌)లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్, ఆర్టు అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్, వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించి గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.

ఇవి కూడా చదవండి: