Last Updated:

Tirumala: తిరుమలలో మరోసారి భద్రతావైఫల్యం.. డ్రోన్‌తో వీడియో షూట్

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అస్సాంవాసులు తిరుమలలోని మోకాళ్ళ పర్వతంపై డ్రోన్‌తో వీడియో తీశారు. మోకాళ్ళ పర్వత ప్రాంతం, ఘాట్ రోడ్డులను అస్సాం వాసులు షూట్ చేశారు.అస్సాంకు చెందిన దంపతులిద్దరూ కారులో మోకాళ్ళ పర్వతంపైకి వచ్చి డ్రోన్‌ను వినియోగించారు.

Tirumala: తిరుమలలో మరోసారి భద్రతావైఫల్యం.. డ్రోన్‌తో వీడియో షూట్

Tirumala: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అస్సాంవాసులు తిరుమలలోని మోకాళ్ళ పర్వతంపై డ్రోన్‌తో వీడియో తీశారు. మోకాళ్ళ పర్వత ప్రాంతం, ఘాట్ రోడ్డులను అస్సాం వాసులు షూట్ చేశారు.అస్సాంకు చెందిన దంపతులిద్దరూ కారులో మోకాళ్ళ పర్వతంపైకి వచ్చి డ్రోన్‌ను వినియోగించారు.చాలా సేపు దంపతులు అక్కడ ఉండి డ్రోన్ వినియోగించినా భద్రతా సిబ్బంది గమనించలేకపోయారు.

నో ఫ్లై జోన్ లో తిరుమల..(Tirumala)

తిరుమలలో డ్రోన్ ఎగరవేయడం నిషేధం. గతంలోనూ శ్రీవారి ఆలయంపై కొందరు అగంతకులు డ్రోన్ ఎగురవేసి విజువల్స్ తీశారు. నో ఫ్లై జోన్ లో ఉన్న తిరుమల గిరులపై విమానాలు వెళ్లటం నిషిద్ధం. ఇలాంటి చోట డ్రోన్ కెమెరా వినియోగించి శ్రీవారి ఆనంద నిలయం దృశ్యాలను అతి సమీపం నుంచి చిత్రీకరించడం నేరం. తాజాగా అస్సాం వాసులు డ్రోన్ తో విజువల్స్ తీయమడం భద్రతా సిబ్బంది వైఫల్యమేనని బయటపడింది. తిరుమలకు డ్రోన్ తీసుకురావడంపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలిపిరి చెక్ గేట్ దాటుకుని కెమెరా తీసుకుని రావడం ఎలా సాధ్యమయిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.