Indrakiladri: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Indrakiladri: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
మానవత్వం చాటుకున్న దుర్గగుడి చైర్మన్..(Indrakiladri)
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వచ్చిన వృద్ధురాలి విషయంలో దుర్గగుడి చైర్మన్ రాంబాబు మానవత్వం చాటుకున్నారు. మెట్లదారి మూసిఉందన్న విషయం తెలియకుండా గుడి మెట్లు ఎక్కి వచ్చిన వృద్ధురాలిని ఆలయ సిబ్బంది తిరిగి వెనక్కి వెళ్లమన్నారు. కానీ అప్పటికే నీరసించిపోయిన వృద్ధురాలు గేట్ వద్ద కూర్చుంది. అది చూసిన చైర్మన్ రాంబాబు గేట్ తాళం చెవి అందుబాటులో లేవు అనడంతో తాళం విరగ్గొట్టి వృద్ధురానికి దర్శన ఏర్పాట్లు చేశారు. తన బాధను అర్థం చేసుకుని ఆదుకున్నందుకు చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.పర్యాటక శాఖ మంత్రి రోజా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామని రోజా అన్నారు. మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల సంక్షేమం కోసమే జగన్ పని చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో శత్రువులని జయించి విజయం సాధించి మళ్లీ జగనే సీఎం కుర్చీ ఎక్కుతారని ధీమా వ్యక్తం చేశారు
మరోవైపు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు ఈఓ పెద్ధిరాజు, చైర్మన్ చక్రపాణి రెడ్డి, వేద పండితులు, అర్చకులు పూజ నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ దేవికి పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 15 రోజులు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని ఈనెల 23న రాష్ట్ర ప్రభుత్వం చేత పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈఓ పెద్ధిరాజు తెలిపారు. శ్రీశైలానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు, అమ్మవారి దర్శనం త్వరగా కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు