Last Updated:

Pravalika Suicide Case : ప్రవళిక అంత్యక్రియలు పూర్తి.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్

గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతూ..  హైదరాబాద్ లోని అశోక్ నగర్ హాస్టల్ లో ఉంటున్న ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా బిక్కజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక.. గ్రూప్ 2 పరీక్షలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరోసారి వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ప్రాణాలను తీసుకుంది.

Pravalika Suicide Case : ప్రవళిక అంత్యక్రియలు పూర్తి.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్

Pravalika Suicide Case : గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతూ..  హైదరాబాద్ లోని అశోక్ నగర్ హాస్టల్ లో ఉంటున్న ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా బిక్కజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక.. గ్రూప్ 2 పరీక్షలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరోసారి వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ప్రాణాలను తీసుకుంది.  శుక్రవారం రాత్రి హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు  గుర్తించారు. బయటకు వెళ్లిన స్నేహితులు తిరిగి వచ్చి చూసే సరికి గదిలో ఉరి వేసుకుని ఉండడంతో హాస్టల్ మేనేజర్‌కి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

ఇక అర్ధరాత్రి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత సొంత గ్రామానికి తీసుకెళ్లారు. ఇక తాజాగా వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి గ్రామంలో ప్రవళిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి కుటుంబ సభ్యులు, గ్రామస్థుల ఆర్తనాదాలతో పాటు పోలిస్ భద్రత మధ్య ప్రవళిక అంతిమ సంస్కరాలు ముగిశాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇప్పుడు కానరాని లోకాలు వెళ్లిపోవడంతో తీవ్ర దుఖంలో మునిగిపోయారు. వారి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్ధి సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.

కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్..  

ఆత్మహత్యకు ముందు ప్రవళిక తల్లిదండ్రులకు రాసిన లేఖ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లెటర్ లో  ‘అమ్మా నన్ను క్షమించు.. నేను ఓడిపోయాను, నా వల్ల నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నావు. ఏడవకండి జాగ్రత్తగా ఉండండి. నీ కూతురిగా పుట్టడం నా అదృష్టం.. నన్ను చూసుకున్నారు. కానీ నేను నీకు చాలా అన్యాయం చేస్తున్నాను. నన్ను ఎవరూ క్షమించరు.. అమ్మా.. నాన్న జాగ్రత్త’ అని రాసింది.

ఇక అంతకు ముందు శుక్రవారం రాత్రి ప్రవళిక మృతికి ప్రభుత్వమే కారణమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తే ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసి జీవితాలతో ఆడుకుంటోందని నిరసన వ్యక్తం చేశారు. పదేళ్లు గడుస్తున్నా గ్రూప్‌ పరీక్షలు నిర్వహించకపోగా ఇప్పుడు మరోసారి వాయిదా వేయడంతో ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.