Tirumala Laddu: తిరుమల లడ్డూ కేసు.. టీటీడీ మాజీ చైర్మన్ పీఏకి నోటీసులు
SIT Issued Notice On Tirumala Laddu Case: తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అప్పన్నను తిరుపతి సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వెనుక ఎవరున్నారు. అసలు ఎక్కడ జరిగింది. ఎవరి పాత్ర ఉంది అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు ప్రశ్నించారు. కొందరిని జైలుకు కూడా తరలించారు. నెయ్యి సరఫరా చేసిన సంస్థతో పాటు పలువురిపైనా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ కేసును సిట్ కు అప్పగించింది. సీబీఐ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ అధికారులతో పాటు నలుగురు ప్రత్యేక అధికారులతో దర్యాప్తు చేపట్టారు. తిరుపతి, తిరుమలతో పాటు పలు ప్రాంతాల్లో విచారణ చేశారు. కీలక సమాచారం, ఆధారాలను రాబట్టారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.