Published On:

Group-1 Interview Schedule: ఏపీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్ రిలీజ్.. జూన్ 23 నుంచి ప్రారంభం

Group-1 Interview Schedule: ఏపీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్ రిలీజ్.. జూన్ 23 నుంచి ప్రారంభం

APPSC Uploaded group-1 Interview Schedule: రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ రెడీ అయింది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తికాగా.. తాజాగా ముఖాముఖి పరీక్షల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కాగా ఇటీవల విడుదల చేసిన గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేసింది. దీంతో మొత్తం 182 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. వీరందరికీ జూన్ 23 నుంచి జూన్ 30 వరకు ముఖాముఖి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఇంటర్వ్యూ షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్ సైట్ లో అప్లోడ్ చేసింది.

 

కాగా ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు జూన్ 10న విడుదలయ్యాయి. మే 3 నుంచి మే 9 వరకు జరిగిన మెయిన్స్ ఎగ్జామ్స్ కు రాష్ట్రవ్యాప్తంగా 4497 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే మెయిన్స్ పరీక్షా ఫలితాలను కమిషన్ విడుదల చేసింది. కాగా ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఆరోజే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు.