Published On:

SIT Enquiry: నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు

SIT Enquiry: నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు

Prabhakar Rao SIT Enquiry In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు హాజరైన ఆయన, ఇవాళ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీకి వచ్చారు. కాగా గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ లను ట్యాప్ చేసినట్టు ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలను బయటపెట్టింది. ఈ వ్యవహారంపై అధికారులు ప్రశ్నించగా ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించట్లేదని సమాచారం. ఆయన నుంచి వచ్చే సమాచారంపై రాజకీయ పార్టీల నేతల ప్రమేయంపై స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రభాకర్ రావు.. సిట్ కు సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటివేస్తున్నారని అధికారుల సమాచారం. మావోయిస్టులతో సంబంధం పేరుతో పలువురు రాజకీయ, పాత్రికేయ ఫోన్ లు ఒకేసారి ట్యాప్ చేయడానికి గల కారణాలను ప్రశ్నించినప్పటికీ, ఆయన స్పష్టత ఇవ్వలేదని సమాచారం. అందుకే ఈ వ్యవహారాన్ని సిట్ బృందం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. ఈ కేసులో ప్రస్తుతం మరికొందరు రాజకీయ నాయకుల స్టేట్ మెంట్లను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: