Tirumala Tirupati Devasthanams: నేడు శ్రీవారి దర్శన టికెట్లు రిలీజ్

September Month Darshanam tickets Release Today: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను ఇవాళ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే వివిధ రకాల సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
కాగా ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు రిలీజ్ అవనున్నారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. అలాగే రేపు ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం విడుదల చేయనున్నట్టు టీటీడీ చెప్పింది. అలాగే తిరుమలలో శ్రీవారి వసతి గదులకు సంబంధించిన కోటా కూడా రేపు రిలీజ్ అవనుంది. కనుక భక్తులు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి టికెట్లు పొందొచ్చని సూచించింది.