Published On:

Andhra Pradesh: ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వాటిపై ఎక్కువ ఖర్చు చేయాలట

Andhra Pradesh: ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వాటిపై ఎక్కువ ఖర్చు చేయాలట

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతినెలా వెచ్చిస్తున్న ఖర్చతో పాటు…  రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీ రాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.

 

కేంద్రం వివిధ కార్యక్రమాల కింది ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని సీఎం అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు…సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్‌కు కారణం అయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని..ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

 

అమరావతిలో  సీఎం చంద్రబాబుతో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. రాజమహేంద్రవరం పర్యటన పూర్తి చేసుకొని అమరావతికి చేరుకున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు.

 

అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని… 94 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తన పాదయాత్ర యువగళం విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు బహూకరించారు.

 

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నాయని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సీఎం చంద్రబాబు ఆలోచనలతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం అని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 4 వందల 30 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు చెప్పారు. హేవలాక్ రైల్వే వంతెనను టూరిజం స్పాట్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: