20 Hours for Tirumala Sarvadarshanam: తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి 20 గంటల సమయం
20 Hours for Tirumala Sarvadarshanam: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. పైగా రోజురోజుకు భక్తుల తాకిడీ పెరుగుతోంది. దీంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. కాగా తిరుమలకు ఇవాళ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా క్యూలెన్లలోకి వస్తున్నారు. దీంతో శ్రీవారి వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక టోకెన్లు కలిగిన సర్వదర్శనం భక్తులకు 6 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. కాగా నిన్న స్వామివారిని 80,440 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పాలు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది.