Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు నాయుడు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పేర్కొన్నారు.
Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.
కాగా నిన్ననే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో ఒకేరోజు షాకు మీద షాకు తగిలినట్లయ్యింది. ముందుగా చంద్రబాబుకు జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగిస్తూ తీర్పు ఇవ్వగా.. ఆ తర్వాత క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీకి కోరగా.. రెండు రోజులు విచారణకు కోర్టు అంగీకరించింది.
ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఉంటుంది. కాగా చంద్రబాబు విచారణ తరుణంలో ఏసీబీ కోర్టు.. అధికారులకు పలు సూచనలు చేసింది.
ఏసీబీ కోర్టు సూచనలు..
ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారించుకోవడానికి అనుమతి మంజూరు చేసింది.
న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబు (Nara Chandrababu Naidu) విచారణ జరగాలని.. విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించకూడదని ఆదేశించింది.
చంద్రబాబు ఆరోగ్య, వయస్సురీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు.
విచారణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే చంద్రబాబును విచారించే అధికారుల జాబితా తమకు అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సీఐడీకి సూచించింది.