IPL 2025: నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా.. గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆప్స్!

Today Two Matches MI VS LSG, DC VS RCB In IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3.30నిమిషాలకు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు ఏడు సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో 6 మ్యాచ్‌ల్లో గెలవగా.. ముంబై ఒక్క మ్యాచ్ మాత్రమే గెలుపొందింది.
అదే విధంగా, ఢిల్లీ వేదికగా మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో బెంగలూరు 19 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 4 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. లక్నో 9 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లు గెలుపొందింది. మిగతా 4 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. పాయింట్ల పట్టికలో ముంబై 5వ స్థానంలో ఉండగా.. లక్నో 6వ స్థానంలో కొనసాగుతోంది.
ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 2 మ్యాచ్‌ల్లో ఓడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలుపొందగా.. 3 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు 3వ స్థానంలో ఉండగా.. ఢిల్లీ జట్టు 2వ స్థానంలో ఉంది.
ముంబై వర్సెస్ లక్నో, ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగే రెండు మ్యాచ్‌లు ప్లే ఆప్స్‌పై ప్రభావం చూపనున్నాయి. ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా ప్లే ఆప్స్ బెర్త్ ఖాయమవుతుంది. అలాగే ముంబై, లక్నో మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ టీం ప్లే ఆప్స్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ రెండు మ్యాచ్‌లపై ఉత్కంఠ నెలకొంది.