Published On:

Rahu Gochar 2025: రాహువు సంచారం.. వీరు నక్కతోక తొక్కినట్లే !

Rahu Gochar 2025: రాహువు సంచారం.. వీరు నక్కతోక తొక్కినట్లే !

Rahu Gochar 2025: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మే నెల చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ నెలలో రాహువు తన రాశిని మార్చుకోబోతున్నాడు. రాహువు మే 18, 2025న ఉదయం 7:35 గంటలకు శని రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. శని సంచారం 2025 సంవత్సరంలో జరిగే ప్రధాన సంచారాలలో ఒకటి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.

నిజానికి.. జ్యోతిష్యశాస్త్రంలో రాహువును నీడ గ్రహంగా పరిగణిస్తారు. ఇది వ్యక్తి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాహువు ఒక రాశిలో దాదాపు 18 నెలలు ఉండి.. ఆ తర్వాత మాత్రమే వేరొక గ్రహంలోకి సంచారిస్తాడు. కానీ రాహువు రాశి మార్పు చెందినప్పుడల్లా అది 12 రాశులపైనా శుభ, అశుభ ప్రభావాలను చూపుతుంది. ఈ సమయంలో.. కొంతమంది నష్టపోతారు. మరికొందరు లాభం పొందుతారు. ఇలాంటి పరిస్థితిలో కుంభ రాశిలో రాహువు సంచారం ఏ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందామా..

మేషరాశి: రాహువు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు మేష రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. మీరు స్టాక్ మార్కెట్ నుండి మంచి లాభాలను పొందుతారు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు నయం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విద్యా రంగంలో పనిచేసే వ్యక్తుల జీతం పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా కోర్టు కేసులలో కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే.. దానిలో కొనసాగుతున్న నష్టం లాభంగా మారతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. అంతే కాకుండా మీరు కొత్త వాహానాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

కన్య రాశి: కన్య రాశి వారికి రాహువు రాశి మార్పు వల్ల ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది . ఇది మీ శ్రేయస్సు, విజయాలు రెట్టింపు అయ్యే సమయం. ఈ సమయంలో మీరు వ్యాపారంలో పాత పరిచయాల నుండి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక పాత స్నేహితుడిని కలుస్తారు. అనుభవజ్ఞుడైన వ్యక్తితో ఉండటం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు. అప్పుల నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో పనిచేసే వ్యక్తులు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం ఉంది. డబ్బు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి.

తులా రాశి: ఈ సమయం మీకు మానసిక ప్రశాంతతను లభిస్తుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారం పట్ల విశ్వాసం కూడా పెరుగుతుంది. ఆస్తి లాభాలు రెట్టింపు అవుతాయి. విదేశీ యాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పుల నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా మీరు మీ అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.  కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. అంతే కాకుండా రాహువు రాశి మార్పు గతం కంటే మీకు మంచి విజయాలను కూడా అందిస్తుంది.